క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో పాలను చేర్చితే?

శనివారం, 17 ఫిబ్రవరి 2018 (13:48 IST)
క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది. అరటి చిప్స్‌ని వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయిస్తే కరకరలాడతాయి. లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్ లో ఉంచి తీస్తే తాజాగా వుంటాయి. బియ్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎండిన పుదీనా ఆకులని మెత్తని పొడిగా చేసి కలిపితే పురుగు పట్టకుండా చక్కని సువాసనతో ఉంటాయి.
 
ఓవెన్‌ను శుభ్రపరిచేప్పుడు లోపల వంటసోడా చల్లి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి. ఉదయమే ఉప్పు, నిమ్మరసం సమానంగా కలిపి దానిలో ముంచిన స్పాంజితో తుడిస్తే దుర్వాసన పోతుంది. పచ్చి బఠాణీలు నిల్వ ఉండాలంటే వాటిని పాలిథీన్ సంచిలో వేసి డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. పాలు కాచే పాత్రకి అడుగున కొద్దిగా నెయ్యి రాస్తే దానిని శుభ్రపరచడం తేలిక అవుతుంది. 
 
మిఠాయిల తయారీకి పంచదార పొడి చేస్తుంటే, నాలుగు బియ్యం గింజల్ని కూడా కలపండి. పొడి ఉండకట్టకుండా ఉంటుంది. కొన్ని రకాల కేక్‌లు, బిస్కట్ల తయారీలో వాడే హేజల్ నట్స్ దొరకనప్పుడు కప్పు బాదం పలుకులు వేసుకోవచ్చు. రుచిలో తేడా వుండదు. 
 
కూరగాయలు ఉడికించాక రంగు కోల్పోకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ నూనె జోడిస్తే సరిపోతుంది. బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో చెంచా పంచదార కలిపితే బియ్యం పిండి తెల్లగా వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు