బజ్జీలు చేసేందుకు కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు, బంగాళాదుంపల ముక్కలకు ఉప్పు, కారం పట్టించి.. అర్ధ గంట తర్వాత బజ్జీ పిండితో ముంచి.. నూనెలో వేపుకుంటే బజ్జీలు రుచిగా వుంటాయి.
ఉలవలతో టమోటా, ఉల్లిపాయలు, మిరపకాయలు చేర్చి ఉడికించి పప్పు చారు చేస్తే రుచి బాగుంటుంది. చపాతీలు మృదువుగా రావాలంటే.. ఉడికించిన బంగాళాదుంపల్ని గోధుమ పిండితో కలిపితే సరిపోతుంది.