వంట చేయడం బోర్ కొట్టేసిందా? ఐతే ఈ టిప్స్ పాటించండి.

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:27 IST)
వంట చేయడం బోర్ కొట్టేస్తోందా? చిరాగ్గా అనిపిస్తుందా? అయితే ఈ టిప్స్ పాటించండి. ఇలా చేస్తే ఒత్తిడి, హడావుడి ఏమాత్రం ఉండదు. వంట చేసి అలసిపోతూ విరక్తి పుడితే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. వంట పని గృహణి మాత్రమే పరిమితం చేసుకోవద్దు. 
 
వంట చేయడానికి సహాయ పడమని జీవిత భాగస్వామి.. లేదా పిల్లలకు చెప్పండి. కూరగాయలు కట్ చేయడం, డైనింగ్ టేబుల్ తుడవడం, గిన్నెలు కడగడం తదితర పనుల్లో హెల్ప్ చేయండి అని అడగండి. ఇలా ఒకరినొకరు సహాయం చేసుకోవడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా అలసిపోకుండా ఉంటారు.
 
ప్రెజర్ కుక్కర్, డిష్ వాషర్.. ఇతరత్రా వస్తువులు బాగానే ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కూరగాయలు కోయడం.. ఇతరత్రా పనులు పూర్తయిన తరువాత వంట గది నుండి బయటకు వచ్చి ఇతర పనులు చేయండి.
 
ఎంత క్వాలిటీ అయితే పని అంత సులువు అవుతుంది. ఖాళీ సమయంలో కూరగాయలను కట్ చేసుకోని పెట్టుకోండి. చెడిపోయే కూరగాయలైతే వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోండి.ఒక్కో పనికి ఒక్కో సమయాన్ని కేటాయించుకోండి. సమయ పాలన పాటిస్తే వంటగదిలో అలసిపోకుండా పనిని పూర్తి చేసుకోవచ్చును. 

వెబ్దునియా పై చదవండి