మునగాకులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా త్రాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకు పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ నొప్పులు తొలగిపోతాయి. రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మునగాకును పాలలో మరిగించి ఆ పాలను త్రాగితే వీర్యవృద్ధి కలుగుతుంది. అలాంటి మునగాకుతో సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
ఉల్లి తరుగు - 1/2 కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కొత్తిమీర తరుగు - పావు కప్పు
ఇంగవ పొడి - చిటికెడు
తయారీ విధానం :
ముందుగా ప్యాన్‌లో ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను వేసి అందులో ఐదు కప్పుల నీటిని చేర్చి కాసేపు ఉడికించాలి. మరో బాణలితో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్రను, మునగాకును వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యారెట్, కొబ్బరి తురుము వేగుతున్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక ఆరబెట్టుకుని మిక్సీలో రుబ్బుకోవాలి. ఆపై బౌల్‌లోకి తీసుకుని అందులో కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకుంటే మునగాకు సూప్ రెడీ.