ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు నిల్వ వుంచకూడదు, ఎందుకో తెలుసా?
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (23:23 IST)
చాలామంది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెడితో పాడయిపోతాయి. ఆ పదార్థాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాము.
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుంది.
ఫ్రిడ్జ్‌లో దోసకాయలను నిల్వ చేయడం వల్ల అవి నీరు, గుంటలుగా మారుతాయి. అందువల్ల వాటిని ప్లాస్టిక్‌లో చుట్టి పెట్టడం ఉత్తమం.