ఇక కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్ ఆయిల్ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది. కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఈ పద్ధతిని అవలంబించవచ్చు. అలాగే కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి. చిక్కుళ్లు, పచ్చిబఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.