డైనింగ్ టేబుల్ ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. కానీ సరిగ్గా శుభ్రం చేసుకోకుండా పెట్టుకుంటారు. మీ డైనింగ్ టేబుల్ ఎప్పుడూ కొత్తగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి చాలు.
1. డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ లేకుండా వేడి పదార్థాలను ఉంచిన గిన్నెలను పెట్టకూడదు. డైనింగ్ ప్లేట్లను టేబుల్ మీద పెట్టేటప్పుడు తప్పనిసరిగా మేట్స్‌ను ప్లేట్ అడుగున ఉంచాలి.
2. భోజనానికి ముందు టేబుల్ మీద దుమ్ములేకుండా మెత్తటి బట్టతో శుభ్రంగా తుడిచి ఆహార పదార్థాలను, ప్లేట్లను, గ్లాసులను అమర్చాలి. భోజనమయిన వెంటనే టేబుల్ మీద ఉన్న ప్లేట్లను, గిన్నెలను, గ్లాసులను తీసేసి.. టేబుల్‌ని శుభ్రం చేసేయాలి.
3. కరెంటు పోయిన సమయంలో కొవ్వొత్తి వెలిగించి భోజనం చేస్తున్నప్పుడు ఆ కొవ్వొత్తిని స్టాండ్ లేకుండా టేబుల్ మీద పెట్టకూడదు.
4. డైనింగ్ టేబుల్ మీద ఉపయోగించే స్టాండ్స్, మేట్స్ టేబుల్ మీదనే ఉంచేయకూడదు. వాటిని వేరేచోట శుభ్రంగా పెట్టాలి. డైనింగ్ టేబుల్ మీద చక్కగా అందమైన ఫ్లవర్ వాజ్‌ను ఉంచితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.