చాలామంది బంగాళా దుంపలను వండేముందుగా చిన్నచిన్న ముక్కలుగా తరిగేసి వండేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల దానిలో వున్న విటమిన్ సి పోతుంది. అందుకే బంగాళా దుంపలను ఉడకబెట్టి ఆ తర్వాత దాని తోలు తీయాలి. కొందరు దుంపలను ఉడకబెట్టకుండానే పీలర్ తీసుకుని దాని తోలు తీసేసి కూరలో వేసేస్తారు. ఇలా చేయడం వల్ల విటమిన్లు కోల్పోతుంది.