నూనెలో వేయించుకునే బంగాళాదుంప చిప్స్ అంటే లొట్టలేసుకుని తినేస్తాం. ఇలా తింటే ఊబకాయం తప్పదు. ఇలా బంగాళాదుంపను ఫ్రై, చిప్స్ రూపంలో కాకుండా ఊదా రంగులో ఉండే బంగాళాదుంపను నూనెలో వేయించకుండా కూర వండుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. కూర వండుకుని బంగాళాదుంపను తీసుకోవడం ద్వారా అధిక బరువు, రక్తపోటును దూరం చేసుకోవచ్చునని పరిశోధనలో తేలింది.