నూనె - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
తయారీ విధానం :
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని తీసుకుని అందులో నూనెను వేసి వేడయ్యాకా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశెనగలు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకరలాడేలా వేయించాలి. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కరివేపాకుతో చేసిన పొడిలో కొబ్బరి పొడి కూడా కలిపి పొడి పొడిగా అయ్యేంతవరకు వేయించి దింపుకోవాలి. అంతే కరివేపాకు పొడి రెడీ.