మనం తీసుకునే ఆహారంలో కాసింత పులుపు కూడా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చింతపండు, నిమ్మ, ఉసిరి, నారింజ ఇలాంటి పులుపు పదార్థాలు తీసుకోవడం ద్వారా నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే పులుపు ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. మితంగా తీసుకోవాలి.
అలా ఎక్కువగా తీసుకుంటే కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. దృష్టి మందగిస్తుంది. శరీరం అనారోగ్యానికి కారణమవుతుంది. ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. కాళ్ళు, చేతులు నీరు పడతాయి. దాహం ఎక్కువ అవుతుంది. ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి. అయితే ఉసిరికాయ, ఆమ్లా, నారింజ, బత్తాయిపండ్లను రోజుకొకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
పసుపు - 1 స్పూన్
నిమ్మకాయలు - 4
తయారీ విధానం:
ముందుగా ఉసిరికాయల్ని కడిగి పొడిబట్టతో తుడిచి ఎక్కడా తడి అంటకుండా కాసేపు ఎండనివ్వాలి. ఎండిన తరువాత కాయలకు నిలువుగా గాట్లు పెట్టి ఉంచాలి. రాతి ఉప్పును మెత్తగా దంచుకోవాలి. తరువాత ఉసిరికాయల్ని ఒక జాడీలో వేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలుపుకుని జాడీకి మూతపెట్టుకోవాలి.