రాగి పాత్రలు మిలమిల మెరిసిపోవాలంటే ఏం చేయాలి?

గురువారం, 19 జూన్ 2014 (14:23 IST)
రాగిపాత్రలు మిలమిల మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? అయితే ఈ చిట్కాలు పాటించండి. స్టీల్, అల్యూమినియం కంటే కాపర్ పాత్రలు కొద్దిరోజులకే నల్లగా మారిపోతాయి. వీటిని మనం ఉపయోగించకపోయినా సరే  ఇవి నల్లగా మారుతాయి.
 
కాబట్టి, మీ రాగి పాత్రలను కొత్తవాటిలా మెరిపించే కొన్ని వంటింటి చిట్కాలను పరిశీలిద్దాం.. వెనిగర్, ఉప్పు రాగి పాత్రలను మెరిసిపోయేలా చేస్తారు.  కాపర్ పాత్రల మీద కొద్దిగా వెనిగర్ ఉప్పు చిలకరించి బాగా రుద్ది, తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే నిమ్మతొక్క, నిమ్మకాయ రసంతో రాగి పాత్రలను శుభ్రం చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. నిమ్మరసం మరియు ఉప్పు: మరో సారి రాగి వస్తువులను శుభ్రం చేసేప్పుడు నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్‌లా చేసి రాగి వస్తువులను పట్టించి పది నిముషాల తర్వాత బాగా రుద్ది కడగాలి. కడిగిన తర్వాత సున్నితంగా ఉండే పొడి వస్త్రంతో తుడవాలి. అలాగే వెనిగర్ సాల్ట్ పేస్ట్‌ మాత్రమే గాకుండా నిమ్మరసం బేకింగ్ సోడాతో రాగిపాత్రలను శుభ్రం చేస్తే తళతళ మెరిసిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి