ఓవరాల్‌గా తెలంగాణలో ఇప్పటివరకు 27,612 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది. ఇవాళ 1506 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 11,012 మంది చికిత్స పొందుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1422 కేసులు నమోదైతే, రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌లో 94, కరీంనగర్‌లో 32, నల్గొండలో 31, నిజామాబాద్‌లో 19, వరంగల్ అర్బన్‌లో 13, పాలమూరులో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.