సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం... కరోనా విజృంభణ వల్ల వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు తగ్గిపోవడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు పేర్కొంది.
ముఖ్యంగా, వ్యవసాయం, స్వయం ఉపాధి పనులు దొరుకుతుండటంతో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా దేశంలోని కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అసోం రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. లాక్డౌన్ విధింపు వల్ల దేశంలో కూలీల కొరత ఏర్పడిందని, ఈ పరిస్థితి చిన్న పరిశ్రమలపై ప్రభావం చూపుతుందని చెప్పింది. దీంతో ఉద్యోగ భద్రత అంశం దిగజారుతోందని తెలిపింది.