డబ్ల్యూహెచ్ఓను వదలని కరోనా మహమ్మారి.. స్విజ్‌లో 65మందికి కోవిడ్

బుధవారం, 18 నవంబరు 2020 (14:40 IST)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా బారిన పడింది. ప్రపంచ ప్రజలకు ఆరోగ్య సమాచారాన్ని అందవేసే డబ్ల్యూహెచ్ఓ కూడా అనారోగ్యం బారిన పడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. యూరప్‌ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. స్విట్జర్లాండ్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జెనీవాలోని డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది కూడా కరోనా బారిన పడినట్లు అధికారులు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో 65 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చాలా మంది ఇంటి నుండి పనిచేస్తున్నారు. కాని ఇప్పటివరకు నమోదైన కేసులలో సగం ఇంటి నుండి పనిచేసే వ్యక్తులలో ఉన్నాయని అంతజాతీయ వార్తా సంస్థ తెలిపింది. 32 మంది ప్రధాన కార్యాలయ భవనం ప్రాంగణంలో పనిచేస్తున్న సిబ్బందిలో ఉన్నారు.
 
ఇక్కడ సాధారణంగా 2 వేలకు పైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. కఠినమైన పరిశుభ్రత, స్క్రీనింగ్, ఇతర నివారణ చర్యలను అమలు చేసినా వైరస్‌ను నియంత్రించలేకపోయారు. ఇప్పటికే కరోనా మహమ్మారిని నిలువరించడంపై డబ్ల్యుహెచ్‌ఓ పలుసార్లు విమర్శలను ఎదుర్కొంది. ప్రారంభ వ్యాప్తి ఎంతవరకు ఉందో దాచడానికి అమెరికా ఏజెన్సీ చైనాతో ఒప్పందం కుదుర్చుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు