తెలంగాణలో కరోనావైరస్ పంజా, కొత్తగా 1,921పాజిటివ్ కేసులు

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి అంతకంతకు పెరిగిపోతున్నాయి. నిన్న గురువారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,921 కేసులు నమోదయ్యాయి. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 88,396కు చేరింది. 674మంది ప్రాణాలను కోల్పోయారు. సోమవారం ఒక్కరోజులో దీని ప్రభావం అధికమైంది. 
 
ప్రస్తుతం సోమవారం మాత్రం 1,210 మంది చికిత్స నిమిత్తం కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,284కు చేరింది. ప్రస్తుతం 23,438 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే 22,046 మంది నమూనాలను పరీక్షించగా 1,921 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
ఒక్క హైదరాబాదు లోనే 44,156 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ఫరిధిలో 356, మేడ్చల్ 168, రంగారెడ్డి జిల్లా 134 కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 72.72గా ఉంది. దేశంలో 70.76గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 320 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు, ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.76 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.99 శాతంగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు