తెలంగాణలో కరోనావైరస్ ఉధృతి... కొత్తగా 2,092 కేసులు నమోదు

గురువారం, 6 ఆగస్టు 2020 (13:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. నిన్న బుధవారం రాత్రి కొత్తగా 2,092 కేసులు నమోదయ్యాయి. దీంతో 13 మంది ప్రాణాలు కొల్పోయారు. రాష్ట్రం మొత్తంలో కేసుల సంఖ్య 73,050కి చేరింది. మృతుల సంఖ్య 589కి పెరిగింది. సోమవారం ఒక్క రోజు మాత్రం 1,289 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 52,103కి చేరింది. ప్రస్తుతం 20,358 మంది చికిత్స పొందుతున్నారు.
 
నిన్న ఒక్క రోజే 21,346 మంది నమూనాలను పరీక్షించగా 2,092 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,43,489 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన పరీక్షలో ఇంకా 1,550 మంది ఫలితాలు రావలిసి ఉందని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 535, మేడ్చెల్ 126, రంగారెడ్డి169, వరంగల్ అర్భన్128, సంగారెడ్డి 100, నిజామాబాద్ 91 కేసులు నమోదయ్యాయి.
 
రాష్ట్రంలో రికవరీ సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 71.3గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 320 కేంద్రాలలో ర్యాపిడ్ యాంటిజెన్ కేసులు పరీక్షలు చేస్తున్నట్లు, ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా తగ్గినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు