కరోనా బారిన పడిన ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. హైదరాబాదుకు షిఫ్ట్

సోమవారం, 13 జులై 2020 (10:45 IST)
AP deputy CM Amzad Basha
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులను కరోనా కాటేస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా బారిన పడ్డారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరారు. కరోనా బారిన పడిన ఆయన భార్య, కుమార్తె కూడా హైదరాబాద్ హాస్పిటల్‌కు షిప్ట్ అయినట్లు తెలుస్తోంది. 
 
తిరుపతిలోని స్విమ్స్‌లో అంజాద్ బాషాకు చికిత్స అందించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తెలిపినప్పటికీ.. హైదరాబాద్‌కు మార్చారు. 
 
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన నేపథ్యంలోనే అంజాద్ భాషా గన్‌మెన్‌కు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. దీంతో జగన్ కడప జిల్లా పర్యటనకు అంజాద్ బాషా దూరంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంతో కాంటాక్ట్ అయిన వారంతా ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు