ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అదేసమయంలో ఈ వైరస్ బారినపడినవారికి సరైన మందు లేదు. అయితే వైద్యులు పర్యవేక్షణలో ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారు. అయితే, కొందరు వైద్యులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటివారి అస్సాంకు చెందిన ఉత్పలజిత్ బర్మన్ ఒకరు. ఈయన కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదికాస్త వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు.
కరోనా పేషెంట్లకు సేవలు అందించే వైద్యులు, నర్సులు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నా.. అంటువ్యాధి సోకుంతదనే అనుమానం వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి అంటుకోకుండా ఉండేందుకు చాలా మంది వైద్యులు హైడ్రాక్సీక్లోరోకైన్ ఉపయోగిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.