ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క శాస్త్రవేత్త లేదా దేశం సరైన మందును కనిపెట్టలేకపోయింది. అందుకే ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా వ్యాక్సిన్లను పలు దేశాలు అభివృద్ధి చేశాయి.