కోవిషీల్డ్ టీకా వేయాలని కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి: కుదరదన్న కేంద్రం

బుధవారం, 18 ఆగస్టు 2021 (09:34 IST)
కోవిషీల్డ్‌తో తిరిగి తనకు టీకాలు వేయాలని కేరళ వ్యక్తి ఏకంగా హైకోర్టులో పిటీషన్ వేసాడు. 
కేరళ హైకోర్టులో విచారణ సందర్భంగా, పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులకు మళ్లీ టీకాలు వేయలేమని ప్రభుత్వం చెప్పింది. 
 
కోవిషీల్డ్‌తో తిరిగి టీకా వేయడానికి అనుమతి కోరిన కన్నూర్ వ్యక్తి పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అతను పనిచేసిన సౌదీ అరేబియాలో కోవాక్జిన్ అనే టీకాకి గుర్తింపు లభించలేదని పేర్కొన్నాడు.
 
గిరికుమార్ టెక్కన్ కున్నుంపురత్ (50), కోవాక్జిన్ తన వీసా నిబంధన ప్రకారం, అతను ఆగస్టు 30 లోపు సౌదీ అరేబియాకు తిరిగి రావాలని లేదా అతను ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంటూ పిటిషన్ సమర్పించాడు.
 
అతను జనవరిలో సౌదీ అరేబియాలో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. కేంద్రం 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు అందించినప్పుడు, అతను తన పాస్‌పోర్ట్ వివరాలను ఉపయోగించి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు