మరణాల సంఖ్య కూడా 400 సమీపానికి దిగివచ్చిందని పేర్కొంది. దేశంలో తాజాగా 17,20,110 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 29,689 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.14కోట్లకు చేరాయి. కాగా, సోమవారం మరో 415 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 4,21,382 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
42,363 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, మొత్తంమీద 3.06కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు 4లక్షల దిగువకు క్షీణించాయి. ప్రస్తుతం 3,98,100 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.27 శాతానికి తగ్గింది. తాజాగా 66,03,112 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. దాంతో టీకా డోసుల పంపిణీ 44 కోట్ల మార్కును దాటింది.