భారత్‌లోకి మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ పేరు ఈటా. కరోనా వైరస్ మహమ్మారే కొత్త రూపందాల్చింది. బ్రిటన్‌లో ఇటీవలే కరోనా ఈటా వేరియంట్‌ను గుర్తించగా, ఇప్పుడీ నూతన రకం భారత్‌లోనూ వెలుగు చూసింది.
కర్ణాటకలోని మంగళూరులో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా, ఈటా వేరియంట్ నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చినట్టు గుర్తించారు. అయితే అతడు కొన్నిరోజులకే కోలుకున్నాడు.
దేశంలో కరోనా రెండో దశ అల సమయంలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభించిన విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున వ్యాపించడంతో పాటు, భారీగా మరణాలకు కారణమైంది. ఆపై డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందినా, దాని వల్ల ముప్పు తక్కువేనని పరిశోధకులు భావిస్తున్నారు.