కోయంబేడు దెబ్బకు హడలిపోతున్న ఆంధ్రా వాసులు : మరో 102 కేసులు

శుక్రవారం, 15 మే 2020 (12:10 IST)
చెన్నై కోయంబేడు దెబ్బకు ఆంధ్రప్రదేశ్ వాసులు హడలిపోతున్నారు. గత 24 గంటల్లో నమోదైన 102 కేసుల్లో 28 కేసులు చెన్నై కోయంబేడుకు వచ్చిన వారే ఉన్నారు. ఈ కేసులు కూడా ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.  
 
రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా మరో 102 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 57 మంది ఉండగా, 45 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవి (మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11) అని వివరించింది. 
 
అలాగే, గత 24 గంటల సమయంలో 60 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,157గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 857 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,252 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది.
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 1, కడపలో 2, కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 8, నెల్లూరులో 14, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో చిత్తూరులో 13, నెల్లూరులో 8, కర్నూలులో 5, కడప, అనంతపురంలో ఒకటి చొప్పున చెన్నై కోయంబేడు నుంచి వచ్చాయి. 
 
ఇకపోతే, జిల్లా వారీగా మొత్తం కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 122, చిత్తూరులో 165, ఈస్ట్ గోదావరిలో 52, గుంటూరులో 404, కడలో 101, కృష్ణలో 360, కర్నూలులో 599, నెల్లూరు 140, ప్రకాశం 63, శ్రీకాకుళం 7, విశాఖపట్టణం 68, విజయనగరం 7, వెస్ట్ గోదావరి 69 చొప్పున మొత్తం 2157 కేసులు ఉన్నాయి. 

 

#COIVDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 57 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2157 పాజిటివ్ కేసు లకు గాను 1252 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 857.#APFightsCorona pic.twitter.com/fF3bLO0S4X

— ArogyaAndhra (@ArogyaAndhra) May 15, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు