ముంబై మురికి వాడను పూర్తిగా పరిశుభ్రం చేశారు. అన్ని ఇళ్లలో శానిటైజింగ్ నిర్వహించారు. బాధితులను గుర్తించి క్వారెంటైన్‌కు తరలించారు. అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. గురువారం నమోదైన 33 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. కాగా, గురువారం ధారావిలో కొత్తగా రెండు మరణాలు కూడా సంభవించాయి.