భారత్‌లో 14 లక్షలు దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

సోమవారం, 27 జులై 2020 (14:41 IST)
భారత్‌లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగి పోతున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో దాదాపు 708 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14, 35, 453 మందికి చేరుకోగా, మృతుల సంఖ్య మాత్రం 32,771గా పెరిగింది. ప్రస్తుతం 4, 85, 114 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,17,568 మంది చికిత్స నిమిత్తం కోలుకున్నారు.
 
కాగా నిన్నటి వరకు దేళంలో మొత్తం 1,68,06,803 శాంపిళ్లను పరిశీలించినట్లు భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్)తెలిపింది. నిన్న ఒక్కరోజే 5, 15, 472 మంది శాంపిళ్లను పరిశీలించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు