దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒకే రోజు 705మంది మృతి

ఆదివారం, 26 జులై 2020 (10:55 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులు వరుసగా కరోనా కేసులు 50వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,661 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,85,522కి చేరింది. ఇందులో 4,67,882 కేసులు యాక్టివ్ గా ఉంటె, 8,85,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 705 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 32,063కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 4,42,263 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,62,91,331కి చేరింది.
 
జులై 23 నుంచి దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 40,000కిపైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,40,000కిపైగా కరోనా కేసులతో పాటు 13,312 మరణాలు చోటుచేసుకున్నాయి.
 
కోవిడ్‌-19 కేసులు పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, కంటైన్మెంట్‌ జోన్లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. అయితే యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న రోగుల సంఖ్య రెట్టింపవడం ఊరట కలిగిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు