దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజురు పెరిగి పోతున్నాయి. లాక్డౌన్ సడలింపు కారణంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా 553 మంది కరోనా వ్యాధితో మరణించారు. తాజా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 9,06,752కు చేరింది.
అయితే ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా 5,71,460 మంది చకిత్స నిమిత్తం కోలుకోవడం జరిగింది. అటు కరోనాతో పోరాడి 23,727 మంది మృతి చెందారు. జూలై 13 వరకు దేశవ్యాప్తంగా 1,20,92,503 శాంపిల్ టెస్టు చేసారు. నిన్న ఒక్క రోజే 2,86,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో కరోనా వైరస్ రికవరీ రేటు 63.2 శాతానికి పెరిగింది.
జులై 6-12 తేదీల మధ్య 1.83 లక్షల కేసులు, 3466 మరణాలు నమోద కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక రాష్ట్రాల వారీగా కరోనా కేసులు పరిశీలించగా ఆంధ్రప్రదేశ్ 1935, ఉత్తర ప్రదేశ్ 1664, తెలంగాణ 1550, గుజరాత్ 902, మధ్యప్రదేశ్ 575, పంజాబ్ 357, చత్తీస్గడ్ 184. ఈ రాష్ట్రాలలో గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
దేశం మొత్తంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. సోమవారం అక్కడ కొత్తగా 6,497 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర కేసుల సంఖ్య 2,60,924కు చేరింది. ప్రస్తుతం డిల్లీలో కూడా అదే పరిస్థితి సోమవారం 1,246 కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకాలో 2,738, తమిళనాడులో4000 కేసులు నమోదయ్యాయి.