మిగిలిన వాటితో పోలిస్తే కేసులు తక్కువే అయినా ఒకసారి ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ బెజవాడ దుర్గగుడి సిబ్బందిని వణికిస్తోంది. ఇప్పటికే ఆలయంలో కీలక అధికారితో పాటు ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో ఏడుగురుకి పాజిటివ్ రావడం ఇంద్ర కీలాద్రిపై చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండుసార్లు సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించగా గతంలో ఓ వేదపండితుడు, ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.
కరోనా పరీక్షలు చేసేవరకు వ్యాధి బయట పడటం లేదు. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండపై పరిస్థితి మారిపోయింది. ఆలయంలో రోజు శానిటైజ్ చేసినా, మాస్కులు ధరించినా రోజు ఎవరో ఒకరు కరోనా బారిన పడ్డారనే సమాచారం వస్తూ ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.