దేశంలో కరోనా అప్డేట్: 24 గంటల్లో కొత్తగా 2364 కోవిడ్ కేసులు

గురువారం, 19 మే 2022 (11:34 IST)
భారత్‌లో కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2364 నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,29,563 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.89 శాతంగా ఉంది.
 
ఇక దేశంలో తాజాగా 10 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,24,303కి చేరింది. ఇక దేశంలో  యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,419కు చేరింది. 
 
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,79,96,905 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 13,71,603 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,89,841 కు చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు