కంచి మఠం వృద్ధాశ్రమం.. 34మంది వృద్ధులకు కరోనా వైరస్

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:30 IST)
కాంచీపురం శంకరమఠం వృద్ధాశ్రమంలో 34మందికి కరోనా సోకింది. తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. రోజువారీగా ఐదు వేల మందికి కరోనా వైరస్‌ సోకిందని తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒకే రోజులో 5,337 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 5,52,674కి పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో రాణిపేట జిల్లా, ఆర్కాడు, కలవై సమీపంలో వున్న కంచి శంకర మఠానికి చెందిన వృద్ధుల ఆశ్రమంలో 64 వృద్ధులకు కరోనా సోకినట్లు తెలిపింది. దీంతో కరోనా సోకిన వారిని వాలాజాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కరోనా సోకిన వృద్ధుల్లో 60 నుంచి 90 ఏళ్ల వయస్సు లోపు వారేనని కంచి శంకర మఠం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు