కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రసిద్ధ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. తిరుమలలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇలా పలు ఆలయాల్లో భక్తులు లేని ఉత్సవాలు, పూజలు జరిగిపోతున్నాయి. ఇదే తరహాలో ప్రసిద్ధ ఆలయం శబరిమలలోనూ భక్తలు దర్శనం ఆంక్షలు విధించడం జరిగింది. శబరిమల దర్శనానికి వెళ్లే స్వాములను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలు చేసింది.
మండల పూజలకు, మకరజ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు శబరిమల సన్నిధానంలో బస చేసేందుకు అనుమతి లేదని దేవస్థానం బోర్డు పేర్కొంది. కరోనా కారణంగా మార్చి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు. నవంబరులో జరిగే మండల పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు.
శబరిమలకు వచ్చే భక్తులకు నీలకల్ ప్రాంతంలో కరోనా పరీక్షలు నిర్వహించి రోజుకు ఐదు వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. 18 మెట్ల వద్ద పోలీసులు ఉండరు. భక్తులు తమకు తామే ఎక్కి వెళ్లాలని బోర్డు పేర్కొంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి వచ్చే భక్తులు కొన్ని రోజులు సన్నిధానంలో బస చేసి వెళ్తుంటారు. అయి ఈ సారి భక్తులు బస చేయడానికి అనుమతి లేదని దేవస్థానం అధికారులు ప్రకటించారు.