తెలంగాణలో కరోనా విలయతాండవం.. 24గంటల్లో 2083 కేసులు.. 11 మంది మృతి

శనివారం, 1 ఆగస్టు 2020 (10:35 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 2083 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,786కి చేరింది. కరోనాతో కోలుకొని ఇప్పటి వరకు 46,502 మంది డిశ్చార్జు కాగా 530 మంది మరణించారు. గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ప్రస్తుతం 17,754 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 
 
శనివారం జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ 17,భద్రాద్రి 35,హైదరాబాద్ 578,జగిత్యాల 21,జనగాం 21, భూపాలపల్లి 24,గద్వాల 35, కామారెడ్డి 18, కరీంనగర్ 108, ఖమ్మం 32,ఆసిఫాబాద్ 8, మహబూబ్ నగర్ 31, మహబూబాబాద్ 40, మంచిర్యాల 37, మెదక్ 16, మేడ్చల్ 197, ములుగు 19, నాగర్ కర్నూల్ 18, నల్లగొండ 48, నారాయణపేట 9, నిర్మల్ 25, నిజామాబాద్ 73, పెద్దపల్లి 42, సిరిసిల్ల 39, రంగారెడ్డి 228, సంగారెడ్డి 101, సిద్దిపేట 16, సూర్యాపేట 34, వికారాబాద్ 21, వనపర్తి 9, వరంగల్ రూరల్ 39, వరంగల్ అర్బన్ 134, యాదాద్రి 10 కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు