ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ అంతానికి ప్రపంచ దేశాలన్నీ విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. వీటిలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా ముందంజ వేసింది. 'సీహెచ్‌ఏడీవోఎక్స్1 ఎన్‌కొవ్-19' అనే ప్రయోగాత్మక టీకాను అభివృద్ధి చేసింది. కోతుల్లో దాని పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్‌స్టిట్యూట్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలించారు.