ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా... రోగులకు సేవ చేస్తుంటే సోకింది...

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:17 IST)
ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా వైరస్ బారినపడిన వైద్యుల సంఖ్య ఢిల్లీలో మూడుకు చేరింది. ఇప్పటికే కేన్సర్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చిన ఓ మహిళకు ఈ వైరస్ సోకింది. దీంతో ఆ ఆస్పత్రిని పూర్తిగా మూసివేసి, ఆమెతో కాంటాక్ట్ అయినవారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 
 
మరోవైపు, తాజాగా మరో ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకింది. వారిద్దరూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెసిడెంట్‌ డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ కరోనా రోగులు ఉంచిన ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఈ ఇద్దరు వైద్యులు మహిళలే. ఒకరు కోవిద్-19 యూనిట్‌లో పని చేస్తున్నారు. మరొకరు జూనియర్ మహిళా వైద్యురాలు. ఈమె బయోకెమిస్ట్రీ విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతోంది. 
 
అయితే, ఈ జూనియర్ వైద్యురాలు ఇటీవలే విదేశాలకు వెళ్లివచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిద్దరూ ఎవరెవర్ని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు