ప్రైవేట్ క్లాసులు కొంపముంచాయి-ట్యూషన్‌కి వెళ్తే.. 15 మంది విద్యార్థులకు కరోనా

శుక్రవారం, 2 అక్టోబరు 2020 (12:39 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ఏపీలో కూడా తీవ్రంగానే ఉంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేటు క్లాసులు కొంపముంచాయి. ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులంతా కరోనా బారిన పడ్డారు.
 
సత్తెనపల్లి మండలం భట్లూరులో 15 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ట్యూషన్‌ చెప్పే మాస్టర్‌కు కరోనా నిర్ధారణ కావడంతో విద్యార్థులకు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థులంతా ఏడేళ్లలోపు చిన్నారులు ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. వైద్యులు విద్యార్థులను ఎన్‌ఆర్‌ఐ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. చిన్నారులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు