చైనాలో ఇప్పటివరకు 80,552 కరోనా కేసులు నమోదుకాగా, ఇందులో 3,042 మంది మృతి చెందారు. చైనా బయట మొత్తం 17,571 కేసులు నమోదవగా.. అందులో వైరస్ కారణంగా 343 మంది మరణించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు సగానికి పైగా కోలుకున్నారు. భారతదేశంలో కరోనాతో బాధపడుతున్న రోగుల సంఖ్య శుక్రవారం(07 మార్చి 2020) నాటికి 31కి చేరుకుంది.
చైనా తర్వాత కరోనా ఎక్కువగా ప్రభావితమైన దేశాలు దక్షిణ కొరియాలో 6,284 కేసులు, 42 మరణాలు నమోదుకాగా, ఇటలీ (3,858 కేసులు, 148 మరణాలు), ఇరాన్ (3,513 కేసులు, 107 మరణాలు), ఫ్రాన్స్ (423 కేసులు, ఏడు మరణాలు). గురువారం నాటికి, పాలస్తీనా మరియు భూటాన్లలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.