దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్.. కొత్తగా 11,039 కేసులు

బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:37 IST)
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 11,039 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. 
 
తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,77,284కు పెరిగింది. మరో 12,255 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,62,631 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
వైరస్‌ ప్రభావంతో కొత్తగా 110 మంది మరణించగా.. మొత్తం 1,54,596 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,60,057 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 41,38,918 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు