క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్, 128 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ వంటివి వినియోగదారులను ఆకర్షించే స్పెసిఫికేషన్లు. భారత్‌లో రియల్‌మి 7ఐ, శాంసంగ్ గెలాక్సీ ఎం11, మోటొరోలా జి9 పవర్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
పోకో ఎం3 6జీబీ+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 10,999 మాత్రమే. 6జీబీ+128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 11,999. కూల్ బ్లూ, పోకో యెల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,000 తక్షణ రాయితీ లభిస్తుంది.