కరోనా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా దేశంలో బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఈ సంఖ్య 18 నుంచి 19 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. జీనోమ్ సీక్వేన్సింగ్ ప్రయోగశాల గుర్తించినట్లు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇందులో బెంగళూరులో నిమ్హాన్స్ ప్రయోగశాలలో మూడు కేసులు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారించారు. ఆరుగురు బాధితులను ఐసోలేషన్ ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కు పంపేలా మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో నమోదైన కేసులో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యక్తిలో వైరస్ గుర్తించారు. అలాగే హైదరాబాద్‌లో ఓ మహిళకు వైరస్ సోకినట్లు సీసీఎంబీ నిర్ధారించింది. అలాగే తెలంగాణ వైద్యాధికారులు సైతం అధికారికంగా ధ్రువీకరించారు. అలాగే ఏపీలో రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళలో కొత్త రకం కరోనా వైరస్ లక్షణాలను అధికారులు కనుగొన్నారు.