భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దేశంలో ఇప్పటివరకూ అత్యధికంగా ఒకే రోజులో 12,881 తాజా కేసులను నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనావైరస్ రోగుల సంఖ్య 3,66,946కు చేరుకుంది.
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ... ఈ మూడు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో అధిక సంఖ్యలో కారోనావైరస్ కేసులను నమోదయ్యాయి. మరోవైపు ఉత్తర ప్రదేశ్, హర్యానాలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,237కు పెరిగింది. గత 24 గంటల్లో కనీసం 334 మంది మరణించారు.
కాగా 1,60,384 యాక్టివ్ కరోనావైరస్ రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనావైరస్ రోగులలో 50% పైగా కోలుకున్నారు. కరోనావైరస్ కేసులు తీవ్రంగా నమోదవడంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఎక్కువ మంది ప్రజలు ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నందున భయపడవద్దని అందరినీ కోరారు.
బుధవారం మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు 3,300 మందికి పైగా పాజిటివ్ అని తేలింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,16,752కు చేరుకుంది. మొత్తమ్మీద కేసులు తీవ్రంగా నమోదవుతున్న రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.