ఇండియాకన్నా తమకే అధికంగా నష్టం వాటిల్లిందని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారని చైనా అధికార మీడియా 'క్సిన్హువా' వెల్లడించింది. భారత జవాన్లే తొలుత దాడికి దిగారని చెబుతూ, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించామని పేర్కొంది.
ఇకపోతే.. ఈ సరిహద్దు దాడిలో 20 మంది భారత జవాన్లు మరణించగా, 30 మందికి పైగా చైనా జవాన్లు మృతి చెందివుండవచ్చునని సమాచారం. సరిహద్దుల్లో వివాదం తరువాత, ఆ ప్రాంతానికి భారీ ఎత్తున చైనా బలగాలను తరలిస్తున్నట్టు సమాచారం.
ఇకపోతే.. లడఖ్‌లోని సరిహద్దుల వద్ద భారత్, చైనా మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో చైనా సైనికులు దాడికి దిగిన ఘటనలో మరికొంత మంది భారత జవాన్లు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.