తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతా ఉద్యోగికి రెండోసారి కరోనా సోకింది. శ్రీవారి ఆలయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగికి జూన్ 27న కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయనకు అప్పుడు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత నెగెటివ్ రావడంతో విధులకు హాజరయ్యాడు.
ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ముంబయిలో దేవాలయం నిర్మాణానికి తర్వలో శ్రీకారం చుడుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వారణాసిలో వేంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వాన్ని స్థలం కేటాయించాలని కోరినట్లు అధికారులు వివరించారు. జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఆలయ నిర్మాణం చేపడుతామని ఆయన తెలిపారు.