తెలంగాణాలో తొలి విడతలో 40 వేల మందికి కరోనా!

గురువారం, 24 డిశెంబరు 2020 (09:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా తొలి విడతలో మొత్తం 40 వేల మందికి కరోనా టీకాలు వేయనున్నారు. ముఖ్యంగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్య, ఐసీడీఎస్ సిబ్బందిని గుర్తించారు. 
 
తొలి విడతలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ చేయనున్న అధికారులు ఆయా పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు వసతుల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇందులోభాగంగా ఈ రెండు జిల్లాల్లో 65 డీప్ ఫ్రీజర్లు సమకూర్చనున్నారు. 
 
వ్యాక్సినేషన్ కోసం కనీసం మూడు గదులు ఉన్న భవనం అవసరం ఉంటుంది కాబట్టి ఆసుపత్రులు, స్కూళ్లు, సామాజిక భవనాలను గుర్తిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వరుసగా 146, 60 కేంద్రాలను గుర్తించారు. ఒక్కో దాంట్లో వందమందికి టీకా ఇవ్వనున్నారు. 
 
కాగా, గురువారం తెలంగాణలో 635 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే, కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 573 మంది కోలుకున్నారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,83,556కి చేరింది. 
 
ఇప్పటివరకు 1,524 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 6,815 కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,75,217 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

 
ఇకపోతే, రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,82,982కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,74,833 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,522కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 6,627మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,467 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు