దేశంతో పాటు.. ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టింది. ఈ వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అనేక దేశాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే, రోజురోజుకూ మరింతగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు విరుగుడు మందును ప్రపంచం ఇప్పటివరకు కనిపెట్టలేక పోయింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పుణెలోని మైల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ కంపెనీలో పరిశోధన, అభివృది విభాగం అధిపతిగా మీనల్ దఖావే భోసాలే అనే మహిళ పని చేస్తున్నారు. ఈమె నిండు గర్భిణి. అయినా, దేశానికి సేవ చేయడమే తొలి కర్తవ్యంగా భావించారు. ఫలితంగా నాలుగు నెలల్లో జరగాల్సిన కిట్ అభివృద్ధి ప్రక్రియను 6 వారాల్లో పూర్తిచేశారు.