కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

ఠాగూర్

బుధవారం, 28 మే 2025 (20:15 IST)
గతంలో కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో దేశంలో 95 శాతానికి పైగా ప్రజలకు కరోనా టీకాలు వేశారు. ఈ టీకాలు వేయించుకున్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందని, ఈ కారణంగానే ఇపుడు మళ్లీ కరోనా వైరస్ ప్రబలుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. 
 
గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి నాటికి దేశంలో 1010 క్రియాశీలక కరోనా కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్ 7లను భారత్‌లో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, ఇతర దేశాలతో పోల్చితే ఈ వైరస్ వ్యాప్తి మన దేశంలో తక్కువగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అదేసమయంలో ఇటీవలికాలంలో కరోనా కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగ నిరోధకశక్తి క్షీణించడం కూడా ఓ కారణమని పేర్కొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు