దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1115 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 43,70,129కి చేరుకుంది. ఇప్పటిదాకా 73,890 మంది మృత్యువాత పడ్డారు.
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,97,394కు చేరుకుంది. 33,98,845 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో ఇప్పటికే భారత్ రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌ను మూడోస్థానంలోకి నెట్టేసింది. అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. అమెరికా ప్రస్తుతం 65,14,231 కేసులతో టాప్‌లో ఉంది.