దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 72,775కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని ప్రభుత్వం పేర్కొంది.
ఇక దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 90వేలకు చేరిన సంగతి తెలిసిందే. గడిచిన 24గంటల్లో 75,809 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 42లక్షల 80వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 33లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల 83వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా, మరణాల రేటు 1.7శాతం ఉంది.
ఇకపోతే, సోమవారం రోజు దేశ్యాప్తంగా 10,98,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది... దీంతో... ఇప్పటి వరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 5,06,50,128కు పెరిగినట్టు పేర్కొంది.