ఆ థెరపీతో కరోనా వైరస్‌ను భయపెట్టారు

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (14:25 IST)
కరోనా వైరస్‌కు మందు లేదు. వ్యాక్సిన్ అసలు లేదు. ఉన్నదంతా సామాజిక దూరం పాటించడం.. జాగ్రత్తగా ఉండటమే. అయితే ఫ్లాస్మా థెరపీతో మొదటిసారి కరోనాను భయపెట్టారు. దేశంలోనే తొలిసారి ఓ కరోనా పేషెంట్ ప్లాస్మా థెరపీతో పూర్తిగా కోలుకున్నాడు.
 
ఢిల్లీ సాకేత్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో  చేరిన 49 యేళ్ళ బాధితుడికి వైద్యులు ఫ్లాస్మా థెరపీ చేశారు. ఆ థెరపీతో అతడు పూర్తిగా కోలుకున్నాడు. అలాగే మరో ముగ్గురు రోగులకు కూడా ఫ్లాస్మా థెరపీ అందజేశారు. వారిలో ఒకరు ఇప్పుడు ఐసీయు నుంచి సాధారణ వార్డుకు మారారు. మిగతా ఇద్దరిలోనూ శ్వాసకోశ సమస్యలు తీరిపోయాయి.
 
అమెరికాలోని హ్యూస్టన్లో ఉన్న సెయింట్ ల్యూక్స్ మెడికల్ సెంటర్లో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌తో చేరిన ముగ్గురు భారత అమెరిక్లకు కూడా ఫ్లాస్మా థెరపీ చేశారు. దీంతో ముగ్గురికి సానుకూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ అశోక్ బాలసుబ్రమణ్యం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు