కరోనా ఎఫెక్ట్: భారత్‌తో పాటు 20 దేశాలపై సౌదీ నిషేధం..

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (15:18 IST)
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా సహా మరో 20 దేశాల ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు గురువారం ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.

ప్రస్తుతం సౌదీలో కరోనా కేసుల సంఖ్య 3,71,356కు చేరింది. ఇప్పటికే 6,415 మంది చనిపోయారు. దీంతో ఆ దేశం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. 
 
ఇందులో భాగంగానే ఇండియాతోపాటు అర్జెంటీనా, యూఏఈ, జర్మనీ, అమెరికా, ఇండోనేషియా, ఐర్లాండ్‌, ఇటలీ, పాకిస్థాన్, బ్రెజిల్‌, పోర్చుగల్‌, యూకే, టర్కీ, సౌతాఫ్రికా, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, లెబనన్‌, ఈజిప్ట్, జపాన్ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించినట్లు ఇండియన్ ఎంబసీ గురువారం ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు